రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజిని సోదరుడు..!!

ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోలుగా పరిచయమై ఆ తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై తన సోదరుడు మాట్లాడడం జరిగింది.

Rajinikanth visits his hometown in Bengaluru; seeks brother's blessings ahead of political party date launch

అయితే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. రజినీకాంత్ కి రాజకీయాల్లోకి రావాలని చాలా ఇష్టం ఉన్నా కూడా తన ఆరోగ్యం తనకి సపోర్ట్ చేయకపోవడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయాన్ని వదులుకున్నాడట.రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా ఏదో ఒక పార్టీకి మద్దతు మాత్రం ఇస్తాడని భావిస్తున్నారు. తాజాగా రజినీకాంత్ రాజకీయ విషయాలను తన సోదరుడు సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.Sathyanarayana Rao and Ayyakannu exchanging their greetings at Rajinikanth's parents' memorial on suburb Olaiyur near Tiruchy on Saturday. (DC)

సత్యనారాయణ తిరుచందూర్ కుమారస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే స్వామివారిని దర్శించుకున్న తరువాత తన రాజకీయాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.రజినీకాంత్ రాజకీయాల్లోకి రారని.. ఆయన వచ్చిన ఎవరికి ఏ ఉపయోగం లేదని ఆయన తెలిపారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చిన ఏ ఉపయోగం లేదని ఎందుకు అన్నారో కూడా ఆయన వెల్లడించారు. ఎందుకంటే రజినీకాంత్ ఆరోగ్యం బాగుంటే చాలు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు చేసేది ఏముంది కాబట్టి తన ఆరోగ్యం కుదుటపడితే అంతకంటే ఏమీ వద్దు.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నాడు. అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. సినిమాలకు కూడా త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రజినీకాంత్ ఏ విధంగా ఈ విషయాల పైన స్పందిస్తారో చూడాలి.