నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `చెన్నకేశవరెడ్డి` ఒకటి. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తే.. టబు, శ్రియా హీరోయిన్లుగా నటించారు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. చెన్నకేశవరెడ్డి వచ్చి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశాడు. అయినా రీ రిలీజ్ లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాలో టబు బాలయ్యకు భార్యగానే కాకుండా తల్లిగా కూడా నటించిందన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మొదట రమ్యకృష్ణను సంప్రదించారట. ఆ టైమ్ లో రామ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. అయితే అలాంటి సమయంలో స్టార్ హీరోకి తల్లి పాత్రలో నటిస్తే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయని రమ్యకృష్ణ మొండిగా నమ్మిందట. ఆ కారణంతోనే చెన్నకేశవరెడ్డి సినిమాను రిజెక్ట్ చేసిందట. దాంతో ఆ ఆఫర్ టబుకు దక్కడమే కాదు.. చెన్నకేశవరెడ్డి ద్వారా ఆమెకు మరిన్ని ఆఫర్లు కూడా తలుపు తట్టాయి.