పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అనుప‌మ‌.. ఎంగేజ్మెంట్ ఫోటోతో స‌డెన్ షాకిచ్చిన కేర‌ళ కుట్టి!

కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోను సోస‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ అనుప‌మ స‌డెన్ షాకిచ్చింది. మ‌ల‌యాళ `ప్రేమ‌మ్‌` తో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ సుంద‌రి.. `అ ఆ`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ.. కేవ‌లం న‌ట‌నా ప్ర‌ధాన‌త్య ఉన్న పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఇమేజ్ తో పాటు భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. గ‌త ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ట్‌, బ‌ట‌ర్ ఫ్లై.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా కాస్త సైలెంట్ అయిన అనుప‌మ.. తాజాగా త‌న‌కు ఎంగేజ్మెంట్ అయిందంటూ ఓ ఫోటోను షేర్ చేసింది.

అయితే నిజంగా అనుప‌మ‌కు ఎంగేజ్మెంట్ అయింది అనుకుంటే పొర‌పాటే. తన వేలికి ప్లాస్టిక్ కవర్ ఉంగరంలా తగిలించుకున్న ఫోటో షేర్ చేస్తూ.. ఎంగేజ్మెంట్ అయిపోయిందని క్యాప్షన్ ఇచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కామెడీగానే ఈ పోస్ట్ పెట్టినా.. నెట్టింట మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది. అనుప‌మ పోస్ట్ పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. అనుప‌మ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌ని.. అందుకే ఇలా హింట్ ఇచ్చింద‌ని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.