బాలయ్య 108 సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హీరో.. అనిల్ రావిపూడి థింకింగ్ మామూలుగా లేదుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా గురించి రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

NBK 108 First Look Out: Nandamuri Balakrishna's Agressive Beard &  Moustached Look Hikes The Interest 'Beyond Imagination'

ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు అంటూ ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. బాలయ్య ఇప్పటివరకు తాను నటించిన హిట్ సినిమాల అన్నిటిలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు.. అందులో భాగంగానే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ గెటప్ లో కనిపించబోతున్నాడు అంటూ ఈ సినిమా యూనిట్ ఇప్పటికే ఓ హింట్ ఇచ్చేసింది.

NBK 108: Nandamuri Balakrishna's project with Anil Ravipudi kicks off with  an official ceremony; pics inside

అయితే ఈ సినిమాలో బాలయ్యతో పాటుగా మరో బాలీవుడ్ హీరో నటిస్తున్నాడనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకి అది ఎంతో కీలకమైన పాత్ర కావడంతో అనిల్ రావిపూడి ప్రత్యేకంగా అక్షయ్ కుమార్ ను కలిసి ఆయనను ఒప్పించినట్లుగా తెలుస్తుంది.

అక్షయ్ కుమార్ కి కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఆయన కూడా నటించడానికి ఆసక్తిగా ఉన్నారట.. మరి బాలయ్య సినిమా లో అక్షయ్ కుమార్ నటిస్తుండటం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో బాలయ్య తో పాటుగా అక్షయ్ కుమార్ ఎలాంటి రోల్ లో కనిపిస్తాడు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest