దసరా సినిమాతో హీరో నానికి భారీ నష్టం.. ఎంతంటే..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోని మొదటిసారి రూ.100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒకేసారి రెండు వారాలలోని రూ.112 కొట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా సినిమా విడుదలైన సమయంలోనే మిక్స్డ్ టాకు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకోగలిగింది. తాజాగా హీరో నానికి ఈ సినిమా నష్టం వచ్చిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

Dasara first look: Nani in a never-seen-before avatar is full of 'rage and  spark' | Entertainment News,The Indian Express

ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో నాని కాస్త పట్టు విడిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నిర్మాత పై భారం పెట్టకూడదని ఆలోచనతోనే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తన రెమ్యూనరేషన్ లో భాగంగా తన దగ్గరే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా ఏ ఛానల్ తీసుకోలేదు.. తన రెమ్యూనరేషన్ లో భాగంగా శాటిలైట్ హక్కులను ఉంచుకున్న నానికి ఇది పెద్ద నష్టం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి..

గతంలో లాగా శాటిలైట్ రైట్స్ హక్కులకు పెద్దగా ఈ మధ్యకాలంలో డిమాండ్ లేదు.. ముఖ్యంగా టీవీ రేటింగ్ విషయాలలో కూడా పెద్దగా లేకపోవడంతో పాటు.. ఆల్రెడీ థియేటర్లో ఓటీటి లలో చూసిన ఈ సినిమాలను టీవీలో చూడడానికి పెద్దగా ఎవరు ఇష్టపడడం లేదు. దీంతో శాటిలైట్ ఛానల్స్ కి కూడా యాడ్ల రూపంలో భారీ మొత్తం కు దెబ్బ పడుతోంది. ఈ క్రమంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలను కొనేటప్పుడు కాస్త ఆలోచించి అడుగు వేస్తున్నారు. కానీ నిర్మాతలకు మాత్రం ఓటిపి హక్కుల ద్వారా బాగానే సంపాదిస్తున్నారు శాటిలైట్ రైట్స్ ద్వారా పెద్దగా అమ్ముడుపోలేదు. ఇదే కాకుండా చాలా సినిమాలు శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయలేదని సమాచారం.

Share post:

Latest