చైతుతో డేటింగ్ అంటూ వార్త‌లు.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేసిన శోభిత‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరిస్తూ చైతు, శోభిత క‌లిసి ఉన్న కొన్ని ఫోటోలు ఇప్ప‌టికే నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి.

మొన్న‌టికి మొన్న కూడా చైతు, శోభిత లండన్ లోని ఒక ప్ర‌ముఖ రెస్టారెంట్ లో డిన్న‌ర్ చేసిన‌ట్లు ఉన్న‌ ఓ పిక్ తెగ వైర‌ల్ అయింది. దీంతో చైతు, శోభిత ఎఫైర్ నిజ‌మే అని చాలా మంది న‌మ్ముతున్నారు. అయితే ఈ విష‌యంపై తాజాగా శోభిత స్పందించింది. చైతుతో డేటింగ్ అంటూ పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వారికి ఇన్‌డైరెక్ట్ గా ఇచ్చిప‌డేసింది.

`ప్రస్తుతం నేను పొన్నియన్ సెల్వన్ సక్సెస్ జోష్ లో ఉన్నాను. ఇలాంటి మధుర క్షణాల్లో ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీల్ అయిపోవాల్సిన పనిలేదు. ఆ రూమర్ తో నాకసలు సంబంధమే లేనప్పుడు, నేను ఏ తప్పు చేయనప్పుడు అర్జెంట్ గా వెళ్లి క్లారిటీ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. నా పని నేను చూసుకుంటూ పోతాను` అంటూ శోభిత చెప్పుకొచ్చింది. మొత్తానికి చైతుతో డేటింగ్ అంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

Share post:

Latest