చరణ్ న‌టించిన‌ సినిమాల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే సూప‌ర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు.

Ram Charan Upcoming Movies 2023 & 2024 With Release Date, Budget & Trailer  - JanBharat Times

ఏకంగా పెట్టిన దానికి ట్రిపుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో చరణ్ నటనకు యావత్ దేశం ఫిదా అయింది. అంతేకాదు మొదటి సినిమాతో మాస్ లుక్ అన్న కామెంట్లను సైతం ఈ సినిమాలో పాజిటివ్ గా మార్చుకున్నాడు రామ్ చరణ్ . ఇక తర్వాత హిల్‌ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ ఆఫర్స్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్న రామ్ చరణ్.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు.

Telugu Chiranjeevi, Chiru, Magadheera, Ram Charan, Toofan, Zanjeer-Movie

ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబ‌ల్‌ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న రామ్‌చరణ్ ..ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అయిపోగానే ఉప్పేన ప్రేమ్ బుచ్చిబాబు తో ఓ సినిమాకు క‌మిట్ అయ్య‌డు. కాగా ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న చిరంజీవి ..చరణ్ సినిమాలలో ఒక సినిమాను ఎందుకు చేశాడు రా అంటూ ఇప్పటికి బాధపడుతున్నాడట.

Ram Charan on Chiranjeevi's 43-years-long career in films | Telugu Movie  News - Times of India

అంతేకాదు ఆ సినిమాని స్వయనా యాక్సెప్ట్ చేసింది చిరంజీవి కావడంతో మరింత బాధపడుతున్నారట. ఆ సినిమా మరేదో కాదు సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన జంజీర్ . హిందీలో జంజీర్.. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త టాక్ ని సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రా కు రామ్ చరణ్ తమ్ముడు లా ఉన్నాడంటూ కామెంట్స్ కూడా వ‌చ్చాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ నటన డిజాస్టర్ అంటూ మెగా ఫాన్స్ సైతం ఆయన పై మండిపడ్డారు.

Thoofan Latest Telugu Full HD Movie || Ram Charan || Priyanka Chopra -  video Dailymotion

అయితే మొదట ఈ కథను విన్నప్పుడు చిరంజీవికి ఈ స్టోరీ రామ్ చరణ్ కు బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. కాగా డైరెక్షన్లో ఫాల్ట్ కారణంగా సీన్స్ మార్చేస్తూ చరణ్ కు నటించే స్కోప్ లేకుండా ఒకే కంటెంట్ తీసుకెళ్లారని ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచిందని ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట. అంతేకాదు ఈ సినిమాను దగ్గరుండి సైన్ చేయించింది చిరంజీవి కావడంతో.. నా కొడుకు జీవితంలో నేను ఇలాంటి మిస్టేక్ చేసానా అని సురేఖ చెప్పుకొని బాధపడుతూ ఉంటారట . ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు ..ఆ మాయకు చరణ్ కూడా బలైపోయాడు అన్నది మాత్రం వాస్తవం.

Share post:

Latest