సైడ్ అయిన నాగబాబు..జనసేనలో ట్విస్ట్..రాజుగారికి ఛాన్స్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..అనుకున్న విధంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టని విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఏదో అప్పుడప్పుడు మాత్రమే వచ్చి..రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశంపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన కోసం అటు నాదెండ్ల మనోహర్, ఇటు నాగబాబు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే మనోహర్..జిల్లాల పర్యటన చేస్తూ..పార్టీని బలోపేతం చేసేందుకు చూస్తున్నారు. ఇప్పుడు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు..వరుసగా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..జనసేన కార్యాలయాలు ప్రారంభిస్తున్నారు. ఇక ఇలా యాక్టివ్ గా తిరుగుతున్న నాగబాబు…వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆసక్తి గా లేరు. ఈ క్రమంలోనే తాజాగా..నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో నాగబాబు బరిలో దిగడం లేదు. దీంతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.

అవును నాగబాబు తప్పుకోవడం వల్ల రఘురామకు ఛాన్స్ దొరికింది. ఎందుకంటే గత ఎన్నికల్లో నాగబాబు జనసేన నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేశారు. దాదాపు రెండున్నర లక్షల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. అప్పుడు వైసీపీ నుంచి రఘురామ గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తులో పోటీ చేయాలని చూస్తున్నారు.

నరసాపురం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇక పొత్తు ఎలాగో ఫిక్స్ అవుతుంది. ఈ క్రమంలో పొత్తు ఉంటే నరసాపురం ఎంపీ సీటు ఏ పార్టీకి ఇస్తే..ఆ పార్టీ తరుపున రాజుగారు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఎలాగో నాగబాబు తప్పుకున్నారు కాబట్టి..రాజుగారికి లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.

Share post:

Latest