షూటింగ్ చేస్తూ ఉండగా నటుడు విక్రమ్ కు ప్రమాదం..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన చియాన్ విక్రమ్ తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తంగాలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఇందులో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తోంది ఈ సినిమా లీడ్స్ లోని కొన్ని ఏళ్ల క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి విక్రం లుక్కుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Chiyaan vikram sustains an injury and takes a break from shooting  thangalaan ps2
తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లో ప్రమాదం జరిగిందని ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విక్రమ్ ఇటీవలే తంగలాన్ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఈరోజు ఉదయం కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో విక్రమ్ కు పక్కటేముక విరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడున్న చిత్ర బృందం విక్రంలో హాస్పిటల్ కి తరలించి వైద్యులతో ఆపరేషన్ చేయించాల్సి వస్తుందని తెలిపినట్లు విక్రమ్ మేనేజర్ తెలియజేశారు.

విక్రమ్ కు ప్రమాదం జరగడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది.. విక్రమ్ కోలుకున్నాకే మళ్ళీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది గతంలో కూడా ఇదే సినిమా షూటింగ్లో విక్రమ్ కు ప్రమాదం జరిగి కొద్దిరోజులు షూటింగ్ ఆగింది దీంతో విక్రం అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు త్వరగా తమ హీరో కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest