మందు కొడితే ప్ర‌భాస్ అలా మారిపోతాడా..? హాట్ టాపిక్ గా మారిన‌ గోపీచంద్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఫ్రెండ్ ప్రభాస్ గురించి గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే గోపీచంద్ `రామబాణం` పలకరించబోతున్న సంగతి తెలిసిందే.

లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్, గోపీచంద్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. డింపుల్ హయతి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 5న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. రామబాణం కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల‌ను పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ‘మీరు మరియు ప్రభాస్ కూర్చొని సిట్టింగ్(మందు తాగుతున్నప్పుడు) వేసినప్పుడు ఎలా ఉంటారు` అని ఓ యాంక‌ర్ గోపీచంద్ ను ప్ర‌శ్నించాడు. అందుకు ఆయ‌న `మీరు మీ స్నేహితులతో సిట్టింగ్ వేసినప్పుడు ఎలా ఉంటుందో, మేమిద్దరం సిట్టింగ్ వేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాం, ప్రభాస్ ఆ టైమ్ లో చాలా స‌ర‌దాగా మారిపోతాడు, మంచి జోక్స్ వేస్తుంటాడు` అని గోపీచింద్ పేర్కొన్నాడు, మొత్తానికి మందు కొడితే గోపీచంద్ ఫుల్ జాలీగా మారిపోతాడ‌ని గోపీచంద్ చెప్ప‌క‌నే చెప్పేశాడు.

Share post:

Latest