సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి రోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్న కుమారుడు మరణించగా ఇప్పుడు తాజాగా తమిళ డైరెక్టర్, కమెడియన్ మనోభాల కన్నుమూశారు. 69 ఏళ్ల మనోభాల గత కొంతకాలంగా కాలేయ బాధతో రెండు వారాలుగా చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజున కొన్ని నిమిషాల ముందు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది.

Manobala - Wikipedia
మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. తమిళ సినీ పరిశ్రమలో నటుడుగా డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు.. తెలుగు ప్రేక్షకులకు కూడా మనోభాల బాగా సుపరిచితమే ఎన్నో తమిళ సినిమాలు తెలుగులో డబ్బైన తర్వాత సూపర్ హిట్టుగా నిలిచాయి.అందులో సగానికి పైగా ఈయన కామెడీ తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలా తెలుగులో మహానటి దేవదాసు వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలలో కూడా నటించడం జరిగింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు.

1970లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోభాల 1979లో భారతి రాజ వద్ద సహాయ దర్శకుడుగా పనిచేశారు ఆ తర్వాత దర్శకుడిగా 20 కు పైగా సినిమాలను తెరకెక్కించారు. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించగా దాదాపుగా 350కు పైగా చిత్రాలను సహాయ నటుడుగా నటించారు. అలాగే ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా హాస్యనటుడుగా నటించారు. అలా పలు సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు మనోబాల. అయితే ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.

Share post:

Latest