హీరోయిన్ దివి అందాలను చూసే దర్శకుడు ఆఫర్‌ ఇచ్చాడని గుసగుస!

తెలుగు చిత్ర సీమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మనవారికి ఎప్పుడు పురుగింటి పుల్లకూరే రుచిగా ఉంటుంది కాబట్టి. దానికి చాలా కారణాలు వున్నాయి. వాటిలో ముఖ్యంగా అందరికీ వినబడేది మాత్రం ఒకే ఒక్క కారణం. అది… మన హీరోయిన్లకి అర్ధ నగ్నంగా కనబడడం ఇష్టముండదని. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ, ఇదే కారణం అని చెప్పి తెలుగు హీరోయిన్లని ఎవ్వరూ తీసుకోరు. అందుకే మన దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ నుండి, కేరళ నుండి అమ్మాయిలను దిగుమతి చేసుకుంటూ వుంటారు.


ఈ క్రమంలో కొంతమంది తెలుగు అమ్మాయిలు అందాల ఆరబోత చేస్తూ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ బిజీగా వున్నారు. వారి హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చూస్తూ నిర్మాతలను ఊరిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలను చూసిన ఫిల్మ్ మేకర్స్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు మరి. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ దివి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే దివి ఫోటోలకు ఫిదా అయ్యాడో ఏమో కానీ ఒక దర్శకుడు ఇటీవల తాను ప్రారంభించిన వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో ప్రముఖ సంస్థ తెరకెక్కిస్తున్న ఆ వెబ్ సిరీస్ లో దివికి మంచి పాత్ర దక్కినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే దివి సదరు సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. మొత్తానికి దివి యొక్క ఫోటోల కారణంగా ఆఫర్లు వస్తూ వున్నాయి అనడంలో అనుమానం లేదు. ముందు ముందు కూడా తప్పకుండా భారీ ఎత్తున ఆఫర్లు వస్తాయని అంతా ఆశిస్తున్నారు. చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్లో దివి నటించిన విషయం అందరికీ తెలిసినదే. ఆ సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేదు కానీ హాట్ ఫోటోల వల్ల మాత్రమే ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest