గుడి క‌డ‌తాన‌న్న అభిమాని.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన‌ డింపుల్ హ‌యాతి!

అందాల భామ డింపుల్ హ‌యాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కావాల్సినంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోవడం వల్ల డింపుల్ కు సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం ఈ భామ `రామబాణం` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించేందుకు సిద్ధం అయ్యింది.

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు.

తాజాగా గోపీచంద్ తో క‌లిసి డింపుల్ హ‌యాతి అభిమానుల‌తో ఇంట్రాక్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌దాగా స‌మాధానం ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని `మీకు గుడి క‌ట్టాల‌నుకుంటున్నాను. అయితే పాల‌రాతితో క‌ట్టాలా..? లేక ఇటుక‌ల‌తోనా..? అని ఆలోచిస్తున్నా..` అని అన‌గా.. అత‌డికి డింపుల్ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది. `పాలరాతితో, ఇటుకలతో వద్దు బంగారంతో కట్టినప్పుడు నాకు చెప్పండి` అంటూ షాకిచ్చింది. దీంతో అక్కడి వారంతా పగలబడి నవ్వుకున్నారు. కాగా, డింపుల్ ప్ర‌స్తుతం త‌న‌ ఆశలన్నీ రామబాణం పైనే పెట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే డింపుల్ కు టాలీవుడ్ లో మ‌రిన్ని ఆఫ‌ర్లు త‌లుపుత‌డ‌తాయి.

Share post:

Latest