ర‌ష్మిక‌తో డేటింగ్‌.. ఫైన‌ల్ గా గుట్టు విప్పిన‌ బెల్లంకొండ శ్రీ‌నివాస్‌!

ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా ప్రేమలో పడిందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలుమార్లు వీరిద్ద‌రూ జంటగా కనిపించడంతో.. డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై రష్మిక ఇంతవరకు స్పందించలేదు.

కానీ బెల్లంకొండ శ్రీనివాస తాజాగా గుట్టు విప్పాడు. అస‌లు నిజం ఏంటో వెల్ల‌డించాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్న బెల్లంకొండ ర‌ష్మిక‌తో డేటింగ్ విష‌యంపై స్పందించాడు. `మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది మీరు ఏకంగా డేటింగ్ అనేస్తున్నారేంటీ.. మేము ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే.

సినిమాల కోసమే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయినా కలిసి ప్రయాణించలేదు. కేవలం ఎయిర్ పోర్టులో మాత్రమే తారసపడ్డాం. అంత మాత్రానికి డేటింగ్ అంటూ వార్త‌లు అల్లేశారు` అంటూ బెల్లంకొండ వివ‌ర‌ణ ఇచ్చాడు. కాగా, ప్ర‌స్తుతం ఈయ‌న `ఛత్రపతి` హిందీ రీమేక్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

Share post:

Latest