జూనియర్ ఎన్టీయార్ సినిమాలో సీరియల్ నటి!

మన జూనియర్ తో నటించడానికి హీరోయిన్లే క్యూలు కడతారు. అలాంటిది సీరియల్ హీరోయిన్ల సంగతి వేరే చెప్పాలా? అవకాశం రవాలేగాని ఎగిరి గంతేస్తారు. తాజాగా చూసుకుంటే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లక్లు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీయార్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒక సీరియల్ నటిని తీసుకున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తావన ఇక్కడ అవసరం లేదు. RRR సినిమాతో మనోడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. తరువాత తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆయన కెరియర్ లో 30వ సినిమా చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈపాటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ టీం త్వరలోనే గోవాకి చెక్కేయబోతున్నారు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా రెండో హీరోయిన్ గా సాయి పల్లవి సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ భార్యగా ఓ సీరియల్ యాక్టర్ ని సెలెక్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈపాటికే 2 సినిమాల్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఆమె దురదృష్టం కారణంగా అవి వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయని ఈమధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ముచ్చటగా మూడోసారి ఆ అవకాశాన్ని ఆమె దక్కించుకున్నట్టు భోగట్టా. ఆమె మరెవరో కాదు, చైత్ర రాయ్.

Share post:

Latest