రానున్న ఈ హారర్ సినిమాలు జనాలను మెప్పిస్తాయా?

ఏ భారతీయ సినిమా పరిశ్రమలో అయినా ఆత్మ – ప్రేతాత్మలతో కూడిన కథలతో ఓ సినిమా తెరకెక్కుతుందంటే ఎంతో బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎత్తుకున్న ఇతివృత్తాంతం అలాంటిది మరి. ఆత్మ – ప్రేతాత్మ బేస్డ్ కధలు మనం మన చిన్ననాటినుండి వింటూ వున్నాం. అందుకే అలాంటి బేస్డ్ కధలు సగటు భారతీయ ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అయితే ఆయా కధలను తెరకెక్కించడం అంత సులువైన పనికాదు. ఓ రకంగా చెప్పాలంటే కత్తిమీద సాములాంటిదే. అయితే కరెక్ట్ గా రీసెర్చ్ చేసి ప్రాజెక్ట్ చేస్తే చరిత్రలో నిలిచిపోయే కధలు అవుతాయి.

దానికి ఉదాహరణగా మన తెలుగులో అనేక సినిమాలు వున్నాయి. నిన్న మొన్నటి అమ్మోరు, అరుంధతి నుండి.. ఈరోజు కార్తికేయ, విరూపాక్ష వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఈ క్రమంలో మరికొన్ని సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆత్మ ప్రేతాత్మలతో కూడిన కొత్త కొత్త సినిమాలు ఇక్కడ తెరకెక్కుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రేక్షకుల నుండి డిమాండ్ ఉంటుంది కనుక.

ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని హారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో మొదటిది టాలీవుడ్ హీరోయిన్ సమంత, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ సినిమా. దీని తరువాత టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. హర్రర్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ సినిమాలో ఆత్మల నేపథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది.

Share post:

Latest