“ఎన్ని ముద్దులు పెట్టానో నాకే తెలియదు”.. రొమాన్స్ విషయంలో చైతూ షాకింగ్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ఏ విషయాన్ని మాట్లాడినా పెద్ద రాద్దాంతాలు చేస్తున్నారు జనాలు. ఒకదాని గురించి మాట్లాడితే రెండు విధాలుగా క్రియేట్ చేసి పడ అర్ధాలు తీస్తున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు అక్కినేని నాగచైతన్య . అఫ్ కోర్స్ విడాకుల విషయంలో నాగచైతన్యను చాలామంది జనాలు ఏకిపారేస్తున్నారు. సమంతకు విడాకులు ఇచ్చి తప్పు చేసావని .. అందుకే మీ ఫ్యామిలీకి పాపం చుట్టుకుంది అంటూ నానా బూతులు తిడుతున్నారు .

అయితే ఆ విషయాలను ఏమాత్రం పట్టించుకోని నాగచైతన్య.. తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు . థాంక్యూ – లాల్ సింగ్ చద్ద సినిమాతో డిజాస్టర్స్ అందుకున్న నాగచైతన్య ప్రజెంట్ “కస్టడి” సినిమా పైన తన ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . మే 12న ఈ సినిమా భారీ రేంజ్ లో విడుదల కాబోతుంది . ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

కాగా ఇదే క్రమంలో యాంకర్ నుంచి “ఇప్పటివరకు మీరు ఎంతమందిని కిస్ చేసారు..?” అని ప్రశ్నించగా ..చైతు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. జనరల్ గా ఇలాంటి ప్రశ్నలు అడిగితే స్టార్ట్ సెలబ్రిటీస్ కి కోపం వస్తుంది . కానీ చైతన్య మాత్రం చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చారు . “కౌంట్ లేదండి నేను ఎంతమందిని కిస్ చేశానో.. నాకే తెలియదు.. నా సినిమాలో చాలా కిస్ సీన్స్ ఉన్నాయి కదా.. అలాంటివి నేను లెక్కపెట్టుకోను ..ఇప్పటివరకు లెక్కపెట్టిన సందర్భాలు లేవు ..ఓ పని చేయండి మీరు లెక్క పెట్టుకోండి “అంటూ చైతు చాలా బోల్డ్గా ఆన్సర్ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే ఎప్పుడైనా కార్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డారా..? అని ప్రశ్నించగా..” అనుకోకుండా ఒకసారి పోలీస్ చూశాడు “అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

Share post:

Latest