గుడివాడలో పసుపు గాలి..బాబుకు ప్రజా మద్ధతు.!

ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టి‌డి‌పి వైపు ప్రజలు వస్తున్నారు. వైసీపీపై విసిగెత్తి ఉన్న ప్రజలు..టి‌డి‌పి వైపు చూడటం మొదలుపెట్టారు. దానికి ఉదాహరణగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన అని చెప్పవచ్చు. ఆ పర్యటనలో జనం రోడ్లపైకి వస్తున్న తీరుని గమనిస్తే..రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని అర్ధమవుతుంది.

ఇటీవల జగన్‌కు ఒకలా, బాబుకు మరొకలా ప్రజా మద్ధతు వస్తుంది. మామూలుగా జగన్ భారీ సభల్లో పాల్గొంటున్నారు. పథకాల పేరిట బటన్ నోక్కే కార్యక్రమాలకు వెళుతున్నారు. అయితే వైసీపీ నేతలు…జనాలని తరలిస్తున్నారు. అవసరమైతే పథకాలు పోతాయని మీటింగులకు ప్రజలని తీసుకొస్తున్నారు. ఎంత బలవంతంగా తీసుకొచ్చిన జనం సభ అయ్యే వరకు నిలబడటం లేదు. మధ్యలోనే జంప్ అవుతున్నారు. కానీ బాబు రోడ్ షోలకు జనం స్వచ్ఛందంగా వచ్చి నిలబడుతున్నారు. మొన్న బందరు రోడ్ షో గాని, నిన్న గుడివాడ రోడ్ షోలో గాని అదే జరిగింది. భారీ స్థాయిలో రోడ్ షో జరిగాయి.

జనం ఎక్కువ ఉండటం వల్ల సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన సభలు..రాత్రి 11 గంటలకు జరిగాయి..అయినా సరే సభల్లో జనం ఉంటున్నారు. గుడివాడ సభలో కూడా జనం రాత్రి 1 గంట వరకు నిలబడ్డారు. అంటే బాబు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారనే అర్ధమవుతుంది. అదే సమయంలో గుడివాడ లో బాబు రోడ్ షో భారీ స్థాయిలో జరిగింది.

దాదాపు 7 గంటలు పైనే రోడ్ షో జరిగింది..అంటే అడుగడుగున జనం ఉంటున్నారు. దీంతో బాబు రోడ్ షో బాగా లేట్ అవుతుంది. దీని బట్టి చూస్తే గుడివాడలో గాలి మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు కొడాలి నాని హవా నడిచింది..ఇకపై ఆయనకు బ్రేకులు పడేలా ఉన్నాయి.