Samantha: శాకుంతలం సినిమా రివ్యూ.. సమంత సక్సెస్ అయినట్టేనా..?

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్తో త్రీడి లెవెల్ లో డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మలయాళం నటుడు దేవ్ మోహన్ ,మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల, గౌతమి వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ రోజున పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడం జరిగింది.

Shaakuntalam Review In Telugu Samantha Dev Mohan Aditi Balan Allu Arha  Starring Shakuntalam Movie Review Rating | Shaakuntalam Review - 'శాకుంతలం'  రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?
శకుంతలం కథ శకుంతల, దుష్యంతుడి పాత్ర ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కథ మొత్తం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు గుణశేఖర్. కథ విషయానికి వస్తే విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేసేందుకే ఇంద్రుడు ఆదేశానుసారం భూలోకాన అడుగుపెడుతుంది మేనక.. ఆమె అంద చందాలతో విశ్వామిత్రుని తపస్సును భంగం కలిగించడమే కాకుండా శారీరకంగా కూడా దగ్గరవుతుంది. దీని ఫలితంగానే ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది.. ఒక మానవుని వల్ల కలిగిన సంతానంతో దేవలోకంలోకి ప్రవేశించలేదు.. అందుకే ఆ పాపను భూలోకంలో వదిలి మేనక స్వర్గానికి వెళ్ళిపోతుంది.

Shaakuntalam movie review: Review: Shakuntalam

ఆ చిన్నారిని ఒక పక్షుల గుంపు వద్ద వదిలి వెళ్ళడంతో ఆ దారిన వెళుతున్న కన్వ మహర్షి చూసి ఆమెను దత్త పుత్రికగా స్వీకరించి పెంచుతూ ఉంటారు. ఆ పాపే శకుంతల.. ఒకానొక రోజు ఆ కన్వశ్రమానికి దుష్యంత మహారాజు విచ్చేస్తాడు. అక్కడ శకుంతలను చూసి ఆమెను ప్రేమించి ఆమె ప్రేమకు దాసోహం అవుతారు . అలా ఇద్దరు కూడా వివాహంతో ఒక్కటవుతారు. కొంతకాలానికి తన రాజ్యానికి తీసుకువెళ్తానని బయలుదేరిన దృశ్యంతుడు ఎన్ని రోజులకి తిరిగిరారు.. ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది శకుంతల దృశ్యంతులు కలుస్తారా లేదా అనే విషయం చూడాలి అంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే ఇందులో సమంత పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.. సొంతంగా డబ్బింగ్ కాస్త ఆకట్టుకోలేకపోయినా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ తనదైన స్టైల్ లో నటించారు. అల్లు అర్హ కూడా చివరిలో బాగానే ఆకట్టుకుంది.మిగిలిన పాత్రలు అన్నీ కూడా పరవాలేదు అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా త్రీడీలో ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. టెక్నికల్ పరంగా అక్కడక్కడ తన మార్కును చూపించలేకపోయారు గుణశేఖర్. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్ అతనకు ఆకర్షణమని చెప్పవచ్చు. మణిశర్మ పాటలు సాయి మాధవ్ బుర్ర సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా సమంత ఈ సినిమాతో సక్సెస్ అయినట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.