హీరోయిన్ పూర్ణ తో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన.. రవిబాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ డైరెక్టర్ నటుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. నటుడుగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దర్శకుడుగా సినిమాలు చేస్తూ ఉంటారు. అల్లరి సినిమాతో మొదలైన తన ప్రయాణం ఆవిరి వరకు సక్సెస్ఫుల్గా సాధించారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ నేపథ్యం గల సినిమాలలో తన మార్కుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రవిబాబు. ఈయన కొన్ని పాత్రలలో ప్రత్యేకంగా నటనతో అందరిని ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.

poorna love affair, Ravi Babu: I have a love affair with Poorna.. but it is  not what people think: Ravi Babu – ravi babu clarifies on love affair with  actress poorna

ముఖ్యంగా ఈయన తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హీరోయిన్ పూర్ణ కీలకమైన పాత్రలో కనిపించడం జరిగింది.. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని గత కొంతకాలంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవి బాబు మాట్లాడుతూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. యాంకర్ రవిబాబుని మీ సినిమాలలో పూర్ణనే ఎక్కువగా తీసుకుంటారు కారణం ఏంటని ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా రవిబాబు ఆమెతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. అలా అన్నానని తప్పుగా అనుకోవద్దు ప్రతి దర్శకుడు తన నటీనటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది.. నటులు ఎప్పుడైనా దర్శకులు చెప్పిన దానికంటే పదింతలు బాగా చేస్తారు కానీ పూర్ణ 200% ఎక్కువగా చేస్తుంది అని తెలిపారు.

అంత మంచి నటి అందుకే ఆమెను ఎక్కువగా సినిమాలను పెట్టుకుంటా.. అలాగని అన్ని సినిమాలు ఆమె చేయదు.. కొన్నిటిని చేయనని నిర్మొహమాటంగా తెలియజేస్తూ ఉంటుంది.. అయితే మొన్న వాషింగ్ మిషన్ సినిమా కోసం అడిగా నేను చేయను సార్ అంది ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తా.. ఆమె పాత్రకి కరెక్టుగా అనిపిస్తే ఖచ్చితంగా నటిస్తుందని తెలిపింది. అలాగని తనకోసం మాత్రం ఒప్పుకోదు కదా అంటూ తెలిపింది.. అంతేకాకుండా యామి గౌతమ్ భూమిక వంటి కథానాయకులు కూడా తన సినిమాలలో నటించారని తెలిపారు. పూర్ణతో కలిసి ఐదు సినిమాలు చేశాను అందుకే ఇలాంటి వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయని తెలిపారు.