చరణ్ – ఉపాసనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా.. టూ రొమాంటిక్ ఫెలో..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని తన పేరును మారు మ్రోగిపోయే విధంగా చేసుకున్నాడు . దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రాంచరణ్ పేరు ఓ రేంజ్ లో హంగామా చేస్తుంది .

కాగా ఇదే క్రమంలో ఆయన భార్య ఉపాసన కూడా గర్భం దాల్చింది అన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఉపాసన – చరణ్ ప్రజెంట్ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు . వీళ్ళు ఎంజాయ్ చేసిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ వెకేషన్ లోనే ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది ఉపాసన. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

కాగా చరణ్ ఆమెకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ హార్ట్ షేప్ లో ఉండే ఇయర్ రింగ్స్ అని అవి ఇప్పటికీ ఆమె వద్ద భద్రంగానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు దానికి రిటర్న్ గిఫ్టుగా ఉపాసనకు ఎనలేని ప్రేమని ఇస్తుందని కామెంట్ చేసింది . అంతేనా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా వెకేషన్స్ ఎంజాయ్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి ..? అని అడిగిన ప్రశ్నకు ..మాతో పాటు మా బిడ్డ కూడా ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నాడు ..ఇంతకంటే ఆనందమేముంటుంది ..జనరల్ గా ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరుగుతారు కానీ ..నేను ఫుడ్ విషయంలో చాలా కఠినం గా ఉంటాను. అలా అని కడుపు మాడ్చుకోవట్లేదు ..అన్నీ తింటాను.. కానీ ప్రోటీన్ ఫుడ్ నా బిడ్డకు కావలసిన ఆహారమే తింటున్నాను అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే చరణ్ టు రొమాంటిక్ అని.. ఉపాసనకు అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు చూసారా అంటూ మెగా అభిమానులు చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు..!!