మరికొద్ది గంటల్లో శాకుంతలం రిలీజ్.. సమంత కు ఊహించని షాక్..!?

పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ బొమ్మ థియేటర్స్ లో పడబోతుంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ చాలా గ్యాప్ తర్వాత థియేటర్లో ఈ సినిమాతోనే పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు సమంత ఫ్యాన్స్ .

కాగ శకుంతల దేవి పాత్రలో సమంత – దుశ్యంతుడి పాత్రలో మలయాళంలో హీరో దేవ్ మోహన్ ఈ సినిమాలో నటించి అలరించబోతున్నారు . ఇప్పటికే ధియేటర్స్ వద్ద భారీ ఫ్లెక్సీలతో ..పూలదండలతో.. సమంతకు స్టార్ హీరోలకి మించిన స్టైల్ లో హంగామా చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో సమంత శాకుంతలం పై నెగటివ్ రివ్యూలు అప్పుడే దర్శనమిస్తూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అక్కినేని నాగచైతన్యకు డివర్స్ ఇచ్చినప్పటి నుంచి సమంత పేరును ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఈ క్రమంలోని సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చే విధంగా ముందు నుంచే సినిమా థియేటర్స్ వద్ద సగం మంది బ్యాచ్ దిగేసి హంగామా చేస్తున్నారని ..కావాలనే సమంత సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తూ తక్కువ రేటింగ్ ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు అంటూ తెలుస్తుంది .

మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు కూడా సమంత సినిమాకి నెగటివ్ రివ్యూలు ఇవ్వమంటూ ప్రచారం చేస్తున్నారట. దీంతో సమంత మరో హిట్ అందుకోబోతుంది అంటూ ఆశగా వెయిట్ చేస్తున్న మూమెంట్లో ఇలాంటి వార్తలు దర్శనం ఇవ్వడం సమంతా అభిమానులకు మింగుడు పడిన రాయిగా మిగిలిపోతుంది. చూడాలి మరి సమంత శాకుంతలం సినిమా ఎలాంటి హీట్ అందుకుంటుందో..!?