ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో తారకరత్న ఎన్టీఆర్‌ను అంతలా అవమానించాడా.. అసలేం జరిగింది..!?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సూటిపోటి మాటలు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సొంత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదు. ఎప్పుడు అయితే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు వచ్చాయో అప్పటినుంచి నందమూరి- తెలుగుదేశం అభిమానులు కూడా తారక్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు.

యమదొంగ తర్వాత కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ లేదు. మళ్లీ టెంపర్ సినిమా నుంచి ఆరు వరసహిట్లతో.. ఈరోజు టాలీవుడ్ లోనే తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. అటు త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హిట్‌ కొట్టాక నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరోను ఎన్టీఆర్‌కు పోటీగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరిగాయి.

Taraka Ratna: విషమంగానే తారకరత్న పరిస్థితి.. బెంగళూరుకు కళ్యాణ్ రామ్,  ఎన్టీఆర్ - Kaburulu

ఆ ప్రయత్నాల్లో భాగంగానే నందమూరి తారకరత్నను హీరోగా చేశారు. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు తారకరత్న హీరోగా ఒకేసారి ఏకంగా తొమిది సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఒక టాలీవుడ్ హీరోను పరిచయం చేసే క్రమంలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఒకేరోజు ప్రారంభం కావటం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది.

Telugu actor Nandmuri Taraka Ratna suffers heart attack during TDP rally,  shifted to hospital, Nandmuri Taraka Ratna, Telugu actor, Tollywood, TDP  rally, heart attack, Jr NTR, cinema latest news

ఎన్టీఆర్ పోటీగానే తారకరత్నను రంగంలోకి దింపారు.. అన్నది వాస్తవం. అయితే తారకరత్న కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడా సక్సెస్ కాలేకపోయాడు. అది వేరే విషయం ఇక నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్‌కు గొడవలు అన్న విషయం ఎప్పటికప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తుంది. ఒకసారి నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్ కు ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ ద్వారా వెళ్లారట ఆ ఫంక్షన్ లో తార‌కరత్న ఎన్టీఆర్‌ను అవమానించారు అన్న ప్రచారం అప్పట్లో వినిపించింది.

ఆ ప్రచారంపై దివంగత తారకరత్న గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. నా తమ్ముడిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. అది కేవలం పుకారు మాత్రమే అని ఆ వార్తలను కొట్టి పడేసాడు. తారకరత్నగ‌త నెల‌ శివరాత్రి రోజున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో నందమూరి కుటుంబం మొత్తం తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలిచింది. దాంతో నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టమయింది.