చిత్ర పరిశ్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం.ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్ కొడతాడు. అలాగే ఒక హీరో నో చెప్పిన కథతో మరో హీరో అపజయాలు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అదే సమయంలో 2008- 2010 మధ్యకాలంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేయకపోవడం.. అదే సమయంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు కూడా అనుకున్నంతగా కలిసి రాలేదు.
అదే సమయంలో మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకున్న డైరెక్టర్లు అందరూ రవితేజతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకసారిగా రవితేజ కెరీర్ మరో లెవల్ కు వెళ్ళింది. అదే సమయంలో ఎన్టీఆర్ చేయాల్సిన మూడు హిట్ సినిమాలను రవితేజ చేసి ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఇక ఆ మూడు సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
భద్ర:
బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అయన భద్ర రవితేజకు అదిరిపోయే మాస్ హిట్ ఇచ్చింది. బోయపాటి టేకింగ్, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. ఈసినిమాకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ, వంశీ పైడిపల్లి రచన భద్రను సూపర్ హిట్ చేశాయి. ఈ కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లింది. అయితే అప్పటికే సింహాద్రి, సాంబ లాంటి పవర్‌పుల్ యాక్షన్ సినిమాలు చేసి ఉన్న ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి కూడా భద్ర కథ వెళ్ళింది. బన్నీ కూడా రిజెక్ట్ చేయాడంతో చివరికి అది రవితేజ చేతిలో పడింది. రవితేజ ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. రవితేజ పక్కన మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించింది.
కిక్:
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ నో చెప్పడంతో ఆ కథను సురేందర్ కళ్యాణ్‌రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూ ఈ కథ చెప్పగా… ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో.. రవితేజ చేతుల్లోకి వెళ్ళింది. రవితేజ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాడు. అలా రవితేజ ఖాతాలో మంచి హిట్ పడింది. అయితే కిక్ సినిమాకు సీక్వల్‌గా వచ్చిన కిక్ 2 మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.
కృష్ణ:
వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమాను ముందుగా మేకర్స్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నారు. మేకర్స్ కత్తి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఎన్టీఆర్‌కు కథ నచ్చకపోవడంతో రిజక్ట్ చేశాడు. తర్వాత వినాయక్ టైటిల్ మర్చి రవితేజతో కృష్ణ సినిమా చేశాడు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. రవితేజను తిరుగులేని స్టార్‌ను చేసింది. ఇలా ఎన్టీఆర్ వదులుకున్న ఈ మూడు సినిమాలు రవితేజకు తిరుగులేని స్టార్ డమ్‌ను తిసుకువచ్చి.. రవితేజ మార్క్‌ట్ ను అమాంతం పెంచేశాయి. అలా ఎన్టీఆర్ పరోక్షంగా తాను వదులుకున్న సినిమాలతో రవితేజ కెరీరిర్ కు హెల్ఫ్ చేశాడని చెప్పాలి.