ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు JR.NTR.. దూరమెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. మే 28వ తేదీన ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 ఏప్రిల్ 28న జన్మించిన ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే వందలో పుట్టిన రోజు కావడంతో ఈ క్రమంలో ఈ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబం. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఒక మీడియా ద్వారా తెలియజేసిన సమాచారం. నందమూరి అభిమానులు కూడా ఈ వేడుకలలో పాల్గొనాలంటే సూచించడం జరిగింది. జానారెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను చాలా పండుగ జరుపుకుంటామని బాలయ్య ఈ వీడియో ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి తమతోపాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు సమాచారం.

మరో రెండు రోజుల్లో జరగబోయే ఈ శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ వస్తారా రారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. తాత పేరును కాపాడుతూ ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ విషయంపై క్లారిటీ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలు ఉన్నారు. తాత పేరునే కాకుండా వ్యక్తిత్వాన్ని పౌరుషాన్ని పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ అన్నగారికి అసలైన మనవడంటూ చాలామంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉంటారు.ఎన్టీఆర్ వస్తేనే ఈ వేడుకకు కలవస్తుందని కచ్చితంగా ఆయన అభిమానులు వెళ్లాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.