క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇలాంటి పిక్స్ నెవెర్ బిఫోర్..

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. విశాల్ నటించిన “యాక్షన్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. కేవలం 2022లోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన ‘అమ్ము’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం మలయాళం, తమిళం సినిమాలలో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో సముద్ర కుమారిగా ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా మట్టి కుస్తీ సినిమాలో మల్లయోధురాలిగా కనిపించి అందరినీ కట్టిపడేసింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో ఐశ్వర్య లక్ష్మి నటించబోతున్నట్లు సమాచారం.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లైఫ్‌లో జరిగే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవలే చీరకట్టులో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి మతి పోగొడుతుంది. చీర కట్టులో చాలా అందంగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి అందరి చూపు తన వైపుకి తిప్పుకుంటుంది. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఐశ్వర్య లక్ష్మి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఐశ్వర్య నటనలోనే కాదు చదువులో కూడా ఫస్టే. ఈ ముద్దుగుమ్మ 2017లో ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసింది.