తొలిసారిగా కొడుకుని పరిచయం చేసిన స్టార్ కమెడియన్.. ఫ్యాన్స్ ఫిదా..

స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కమెడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ప్రియదర్శితో పాటు రాహుల్ రామకృష్ణ కూడా ఒకడు. వీరు తమ కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. దానివల్ల అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అభిమానుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు, ఆర్ ఆర్ సినిమాల్లో ఈ నటుడి పర్ఫామెన్స్ అందరినీ అంతగానో అలరించింది.

గత ఏడాది హరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు రాహుల్ రామకృష్ణ. అయితే అతని పెళ్లి విషయాన్ని ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచాడు. ఇక గత ఏడాది నవంబర్ నెలలో తాను తండ్రి కాబోతున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇటీవలే సంక్రాంతి పండుగ రోజున రాహుల్ రామకృష్ణకి కొడుకు పుట్టినట్లు ప్రకటించాడు. కానీ కొడుకు ఫోటో ని మాత్రం రివిల్ చెయ్యలేదు.

అయితే తాజాగా తన కొడుకు ఫోటోతో పాటుగా పేరుని కూడా ప్రకటించాడు. అయితే రాహుల్ రామకృష్ణ తన కొడుకు పేరు చాలా డిఫరెంట్ గా పెట్టుకున్నాడు. రూమి ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అని క్యాప్షన్ తో రాహుల్ కొడుకు, అతని భార్య హరిత కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేసాడు. ఆ ఫొటోలో హరిత, రూమి ని ఎత్తుకొని ఉంది. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.