ఈ స్టార్ హీరోయిన్లు నటనలోనే కాకుండా దర్శకులుగా, రచయితలగా రాణించారని మీకు తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలను కూడా ఒక ఊపు ఊపిన తెలుగు హీరోయిన్ల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ వారి గురించి తెలుసుకోవాలనినే ఆలోచన మాత్రం ఎవరికీ ఉండదు. నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపిన అనేక మంది హీరోయిన్లు.. తమ జీవితాలలో రచయితలుగా, దర్శకులు కూడా ఎంతో ప్రత్యేకతను చాటుకున్నారు.

Bhanumathi - A Perfect Ashtavadhani @ iluvcinema.in | Actors, Asian celebrities, Vintage vignettes

ఇక అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేది మహానటి సావిత్రి, భానుమతి, అంజలీదేవి, షావుకారు జానకి, లావు బాల సరస్వతి దేవి. వంటి ఎందరో హీరోయిన్లు రచయితల గా మారి అనేక పుస్తకాలు రచించారు. భానుమతి రాసిన ఎన్నో పుస్తకాలలో అత్తగారి కథలు ఎంతో గొప్పగా ఉంటాయని చెప్పాలి.
సీనియర్ హీరోయిన్ అంజలీదేవి రచించిన శ్రీవారి కథామృతం, షిరిడి సాయి పుట్టపర్తి సాయి జీవిత చరిత్ర( ఇక దీనిని టీవీ సీరియల్ గా కూడా తీశారు) మరో హీరోయిన్ కృష్ణకుమారి రచించిన శ్రీకృష్ణ లీలలు వంటి పుస్తకాలు అప్పట్లో బాగా అమ్ముడుపోయాయి.

లావు బాల సరస్వతి.. `ఇది తెలుగు సినీ క‌థ‌“(ఇప్పుడు పుస్త‌కం లేదు) అప్ప‌ట్లో తెలుగు సినీమాల్లోకి ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన‌వారి వివ‌రాలు..అ డ్ర‌స్‌లు.. ఫోన్ నెంబ‌ర్లు(ఇళ్లు/ ఆ ఫీసులు) వంటివాటిని కూర్చి రాసిన పుస్త‌కం. ఇక వేరే కాకుండా ఎందరో హీరోయిన్లు రచయితలుగా దర్శకులుగా మరి ఎన్నో పుస్తకాలను, సినిమాలను తెరకెక్కించారు. అలనాటి హీరోయిన్లు రచించిన పుస్తకాలు నేటికీ చెన్నైలోని విజయ స్టూడియో లో ఉన్నాయని అంటారు.