ఎన్టీఆర్ సూపర్ హిట్ రీమేక్‌ కోరిక బాలయ్య అలా తీర్చుకున్నాడా…!

నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పౌరాణికం- సాంఘికం- భక్తి- జానపదం ఇలా ఏ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే పాతాళభైరవి లాంటి జానపద సినిమాలో నటించారు. 1951లో వ‌చ్చిన‌ ఈ సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వ‌హించ‌రు. ఎన్టీఆర్ త‌న కేరీర్ బిగినింగ్‌లోనే చూపించిన ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Celebrate NTR Jayanthi with 11 prolific movies starring NT Rama Rao

ఈ సినిమాలో హీరోన్లుగా కే.మాలతి- సావిత్రి- గిరిజ- సురభి- కమలాబాయి లాంటి వారు కూడా నటించారు. ఇక తోటరాముడిగా ఎన్టీఆర్ చేసిన సాహసలు, బేతాళ మాంత్రికుడుగా ఎస్వీ రంగారావు నటన అప్పట్లో సినిమాకు ఎంతో హైలైట్‌గా నిలిచ్చింది, 1952లో భారత దేశంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక సినిమా కూడా పాతాళభైరవి.

Watch Patala Bhairavi movie - Starring NTR as Lead Role on ETV Win |  Download ETV Win on Play Store

ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా వ‌చ్చిన బాల‌కృష్ణ త‌న తండ్రి న‌టించిన పాతాళభైరవి సినిమాను ఎప్ప‌టికైన రీమేక్ చేయాల‌నే కోరిక ఉండేద‌ట‌. బాలయ్య వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో త‌న‌తో ఆదిత్య 369 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సింగీతం శ్రీనివాస‌రావుతో పాత‌ళ భైర‌వి రీమేక్ బాధ్యతలు అప్పగించితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బాలయ్య చేశారు.. అయితే పాతాళ భైరవి రీమేక్ కాకపోయినా అదే తరహా జానపద సినిమాలో నటించాలన్న బాలయ్య కోరిక భైరవద్వీపం సినిమాతో తీరిపోయింది.

Balakrishna: భైరవద్వీపంలోని ఆ గెటప్ కోసం బాలకృష్ణ ఎంత కష్టపడ్డారో తెలుసా  ?.. ఆ విషయంలో చాలా సీరియిస్‏గా.. | Director singeetham srinivasarao says  interesting details about ...

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. చందమామ విజయ బ్యానర్‌పై బి. వెంకట్రామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రావి కొండలరావు కథ‌ మాటలు అందించారు. బాలయ్యకు జోడిగా రోజా నటించిగా రంభ ప్రత్యేక పాట‌లో న‌టించింది. ఈ సినిమా విడుద‌లై టాలీవుడ్‌లోనే ఓ ప్ర‌త్యేక సినిమాగా నిలిచింది. అప్ప‌టిల్లో ఈ సినిమాకు ఎన్నో అవార్టులు కూడా వ‌రించాయి.

Watch Bhairava Dweepam Full Movie Online in HD Quality | Download Now

 

విజయ సంస్థలో అంతకుముందు సింగీతం శ్రీనివాసరావు బృందావనం సినిమా తీసి సూపర్ హిట్ అందునున్నారు. ఇక రావి కొండలరావు అందించిన జానపద కథకు మళ్ళీ ఆయన దర్శకుడు అయితేనే బాగుంటుందని విజయా సంస్థ భావించింది. ఇక ఈ సినిమా కథపై కూడా పాతాళ భైరవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రావి కొండలరావు కూడా పాతాళభైరవి స్ఫూర్తితోనే భైరవద్వీపం కథను కూడా అల్లుకున్నారు.

Bhairava Dweepam'

ఇక బాలయ్య కథ విన్న వెంటనే తన తండ్రి నటించిన పాతాళభైరవి తరహాలోనే ఉందని తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతుందని వెంటనే ఒప్పుకున్నారు. అలా బాలయ్య త‌న‌ తండ్రి బాట‌లోనే పౌరాణికం, సాంఘికం, భక్తి రస సినిమాల‌తో పాటు జానపద కథలకు కూడా కరెక్ట్ గా సూట్ అవుతార‌ని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.