దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే ప్రధనంగా హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జెడి చక్రవర్తి- రంభ జంటగా బొంబాయి ప్రియుడు సినిమా వచ్చింది. పెళ్లి సందడి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా కొత్త హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు- జేడి చక్రవర్తి తో పాటు అప్పటికే ఫామ్ లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకుని బొంబాయి ప్రియుడు సినిమా తీసారు
ఈ సినిమాలో పాటలు అన్నీ ఎంతో సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకరోజు సినిమా షూటింగ్లో బత్తాయి పళ్ళు కిందకు దొర్లుకుంటూ వస్తుండగా ఓ పాట షూట్ చేస్తున్నారు. అదే పాటలో పైనాపిల్ పండు కూడా రాఘవేంద్రరావు వాడారు. అయితే జెడి చక్రవర్తి సరదాగా ఇప్పుడు నీ మీద బత్తాయి పళ్ళు వేయిస్తారు. ఆ తర్వాత ఇంత పెద్ద పుచ్చకాయ తీసుకువచ్చి వేయిస్తారని చెప్పడంతో రంభ ఫక్కున నవ్వేసింది అట.
ఓవైపు రాఘవేంద్రరావు పాట షూటింగ్ కోసం తిప్పలు పడుతుంటే ఇటు హీరో హీరోయిన్లు జోకులు వేసుకొని నవ్వడంతో ఒక్కసారిగా రాఘవేంద్రావు సీరియస్ అయ్యారట. మీరు ఎంత సేపు ముచ్చట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి.. ఎంతసేపు నవ్వుకుంటారో నవ్వుకోండి. మీరు నవ్వుకోవటం ఆపేసిన తర్వాతే షూటింగ్ చేస్తానని చెప్పుతు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయరట. రాఘవేంద్రరావు ఒక్కసారిగా అలా తనపై సీరియస్ అవ్వడంతో రంభ అక్కడే ఒక్కసారిగా బోరున ఎడ్చేసిందట.
తన తప్పు లేకుండా జె.డి చక్రవర్తి చేసిన పనికి తాను డైరెక్టర్‌తో అనవసరంగా మాట పడ్డానని ఆమె ఎంతో బాధపడిందట. చివరకు అక్కడ ఉన్న వారు సద్ది చెప్పడంతో తిరిగి రాఘవేంద్రరావు ఆ పాటను పూర్తి చేశారట. అలా బొంబాయి ప్రియుడు సినిమా షూటింగ్ టైంలో జెడి చక్రవర్తికి ప్రతి రోజు ఇలాంటి పనులు చేస్తు నాతో గోడవలు పడుతు ఉండేవాడిని రంభ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.