అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!

అటు సి‌ఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు.

కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు నిర్వహిస్తున్నారు. ఇక అధికార పార్టీ కావడంతో..అధికారం మొత్తం వాడి సభలకు జనాలని తరలిస్తున్నారు. బస్సులు పెట్టి మరీ జనాలని రప్పిస్తున్నారు. అయితే సభలకు వచ్చిన జనం..జగన్ స్పీచ్ అయ్యే వరకు ఉండటం లేదు..మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. ప్రతి సభలోనూ అదే జరుగుతుంది. ఇక జనాలని సభలోనే ఉంచేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా శింగనమల నియోజకవర్గంలో జగన్ సభ జరిగింది. అక్కడ జనాలని బాగానే తరలించారు.

అలాగే జనం బయటకు వెళ్లిపోకుండా పకద్భందిగా బారికేడ్లు పెట్టారు. అయినా జనం ఆగలేదు. సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడం, ఉక్కపోతతో జనం ముందే జంప్ అయ్యారు. ఇక బాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కంటూ రోడ్లపై తిరుగుతున్నారు. బాబు రోడ్ షోలకు జనం బాగానే వస్తున్నారు. అటు సభలకు జనం కనిపిస్తున్నారు. కాకపోతే టి‌డి‌పి శ్రేణులు కసి మీద ఉండి..భారీ ఎత్తున వస్తున్నారు.

అలాగే టి‌డి‌పి నేతలు..తమ కార్యకర్తలని తరలిస్తున్నారు. ఇక్కడ కూడా జనం తరలించే కార్యక్రమం చేస్తున్నారు. కాకపోతే ఎక్కువ శాతం టి‌డి‌పి శ్రేణులు కసితో వస్తున్నారు. దీని బట్టి చూస్తే జనం మద్ధతు కాస్త బాబుకు పెరిగినట్లే ఉంది..కానీ జనం నాడి మాత్రం దొరకడం లేదు. వారు ఎవరికి మద్ధతు ఇస్తారో అర్ధం కాకుండా ఉంది.