నమిత- శరత్ బాబు పెళ్లి చేసుకున్నారా.. ఇందులో నిజమెంత..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నమిత సుపరిచితమే. ఇమే తెలుగులో పాటు తమిళంలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది. మొదట సొంతం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వెంకటేష్ తో జెమిని రవితేజ తో ఒక రాజు ఒక రాణి సినిమాలలో నటించి బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె బరువెక్కి చాలా బొద్దుగా మారిపోయింది.అయినప్పటికీ కూడా .. బాలయ్య సింహ సినిమాతో పాటు ప్రభాస్ బిల్లా సినిమాలలో కూడా నటించింది.

நமீதாவை நான் பார்த்தே ரெண்டு வருசமாச்சு' - திருமண வதந்தி பற்றி நடிகர்  சரத்பாபு | Actor Sarath Babu about wedding rumor with namitha - Tamil  Filmibeat
గ్లామర్ వలకబోయడంలో ఈ ముద్దుగుమ్మకు ఎవరు సాటి రారని చెప్పవచ్చు. 2017లో వ్యాపారవేత్త నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె పలు సినిమాలలో నటించింది. గతంలో నమిత పైన పలు రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా వీరేంద్ర పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా సీనియర్ నటుడు శరత్ బాబుతో నమిత పెళ్ళంటూ అప్పుట్లో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ వార్తలు నమిత దగ్గరికి చేరడంతో నమిత వాటిని తిప్పి కొట్టింది. దీంతో నమితకి అవకాశాలు తగ్గుతూ ఉండడంతో బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టింది.. అలా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన తర్వాత నమిత శరత్ బాబుతో సహజీవనం చేస్తోంది అంటూ వార్తలు వినిపించాయి ఇదే వార్త పై నమిత స్పందిస్తూ గతంలోని క్లారిటీ ఇచ్చింది. బిగ్బాస్ షో నుంచి బయటికి వచ్చాక తన కుటుంబాన్ని చూడడానికి గుజరాత్కు వెళ్లాను మీరు చెప్పినట్టుగా ఆ నటుడు శరత్ బాబు ఎవరో కూడా నాకు తెలియదు నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ అతనితో నాకు వివాహమైందంటూ వచ్చే వార్తలు కేవలం రూమర్స్ అంటూ తెలియజేసింది. శరత్ బాబు గురించి గూగుల్లో సెర్చ్ చేయగా ఆయన నాకంటే వయసులో చాలా పెద్దవారు.. అలాంటి పెద్దమనిషి తో నేను ఎఫైర్ పెట్టుకొని పెళ్లి చేసుకుంటారంటూ రాయడంపై నిజం లేదంటూ నమిత గతంలో క్లారిటీ ఇచ్చింది.