దారుణమైన స్థితిలో స‌మంత.. ఆమెకు ఏమైందంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గ‌త ఏడాది మ‌యోసైటిస్ అనే వ్యాధికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాధి కార‌ణంగా కొద్ది నెల‌లు ఇంటికే ప‌రిమితం అయిన స‌మంత‌.. మ‌యోసైటిస్ నుంచి కాస్త కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చింది. ఇటీవ‌ల శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో స‌మంత త‌న హెల్త్ గురించి పలు వ్యాఖ్య‌లు చేసింది.

ఒంట్లో ఓపిక లేద‌ని, త్వరగా నీరసించిపోతున్నాన‌ని, అలాగే త‌న‌ కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని స‌మంత పేర్కొంది. దీంతో సమంత ఆరోగ్యం మీద అభిమానుల్లో ఓ ఆందోళన కొనసాగుతుంది. ఇలాంటి త‌రుణంలో సమంత షేర్ చేసిన ఫోటో సంచలనమైంది. సదరు ఫోటోలో సమంత ఆక్సిజన్ మాస్క్ తో దారుణ‌మైన స్థితిలో ద‌ర్శ‌న‌మిచ్చింది.

ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ స‌మంత‌కు ఏమైందంటూ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. స‌మంత‌ హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నారట. హైపర్బేరిక్ థెరపీ ట్రీట్మెంట్ వాపు, ఇన్ఫెక్షన్స్, డామేజైన కండరాలను బాగుచేయడంలో హెల్ప్ చేస్తుంది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంతకు హైపర్బేరిక్ థెరపీ అవసరమట. ఈ విషయాన్ని అభిమానులతో సమంత స్వ‌యంగా తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.