బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే.

దాదాపు ఐదు రోజులు ఐటీ బృందాలు సోదాలు జ‌రిపారాని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ దాడుల్లో ఏం దొరికాయన్నదానిపై ఐటీ అధికారులు ఇంకా ఏమీ వెల్లడించలేదు. ఈ సోదాల్లో ఏం బయట పడింది అనే విషయం లో క్లారిటీ లేదు. కానీ ఐటీ రైట్స్ వల్ల సుకుమార్ బాగా హ‌ర్ట్ అయ్యార‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది.

ఇప్పుడు ఉన్న పరిస్థితి లో తాను షూటింగ్ చేయలేనని.. ఈ ఒత్తిడి నుండి బయట పడేందుకు కనీసం రెండు మూడు వారాలు బ్రేక్ కావాలని సుకుమార్ చెప్పార‌ట‌. ఐటీ రైట్స్ వల్ల నిలిచి పోయిన పుష్ప 2 సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు కనీసం రెండు మూడు వారాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.