పెళ్లిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ పైమా..!!

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు. గతంలో పటాస్ షోలో కామెడీతో నవ్వించిన ఈమె.. అనూహ్యంగా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుగా నవ్విస్తూ ఉండేది. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చిన ఫైమా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో అసలు కనిపించలేదు. బిగ్ బాస్ వల్ల పైమా కూడా ఆర్థికంగా స్థిరపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు షోలలో కూడా సందడి చేస్తూనే ఉంది.

Faima Shiek (Bigg Boss 6 Telugu) Wiki, Height, Age, Boyfriend, Family,  Biography & More - WikiBio
ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఫైమా మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోబోయే వాడి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది..నన్ను చిన్నపిల్లల చూసుకోవాలని కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే తనని తన కుటుంబాన్ని కూడా అర్థం చేసుకునే వాడై ఉండాలి అంటూ తెలియజేసింది ఫైమా. ముఖ్యంగా మంచి మనసున్న వ్యక్తి అయ్యి ఉండాలని తెలిపింది పైమా. అయితే గతంలో ఫైమా, ప్రవీణ్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరు షోలతో బిజీగా ఉండడం వల్ల వీరిద్దరు మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందని కలిసి స్కిట్లు చేయలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కానీ కెరియర్ పరంగా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జబర్దస్త్ లోకి పైమా రీఎంట్రీ ఇస్తుందని గతంలో వెల్లడించింది. ఈ షో తో ఆమె రీఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి. బిగ్ బాస్ తర్వాత ఫైమా రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి షో రూమ్ అయినా సరే పైన నటిస్తూ బిజీగా ఉంటోంది అంజలి. మరి త్వరలోనే పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.