4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగిన అల్ల‌రి న‌రేష్‌.. ఆ త‌ర్వాత ఏమైందో తెలిస్తే షాకే!

`అల్లరి` మూవీతో హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మై తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అల్ల‌రి న‌రేష్‌.. కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కామెడీ చిత్రాల‌తోనే కెరీర్ ను నెట్టుకొచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. `నాంది` మూవీతో రూట్ మార్చాడు. కామెడీ ప్రాధాన్యత క‌థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. సీరియ‌స్ సినిమాలు చేయ‌టానికి మొగ్గు చూపుతున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు `ఉగ్రం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో మిర్నా హీరోయిన్ గా న‌టించింది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఏప్రిల్ 28న విడుద‌ల కాబోతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో అల్ల‌రి న‌రేష్ నాలుగు రోజుల్లోనే 500 సిగ‌రెట్స్ తాగేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా అల్ల‌రి న‌రేష్ స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టాడు. ఈ సినిమాలోని ఓ భారీ ఫైట్ సిన్ ఉంటుంద‌ట‌. అందులో అల్ల‌రి న‌రేష్ సిగ‌రెట్ తాగుతూ ఫైట్ చేయాల్సి ఉంటుంద‌ట‌. దాదాపు ఈ సీన్ ను నాలుగు రోజుల పాట చిత్రీక‌రించార‌ట‌. దాంతో ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 500 సిగ‌రెట్స్ తాగేశార‌ట న‌రేష్.

సాధార‌ణంగానే సిగ‌రెట్స్ తాగితే ఆరోగ్యం పాడ‌వుతుంది. అలాంటి నాలుగు రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగితే ఇంకేమైనా ఉందా.. అల్ల‌రి న‌రేష్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. అన్ని సిగ‌రెట్స్ తాగ‌డం వ‌ల్ల ఆయ‌న ఆరోగ్యం దెబ్బ తిన్న‌ద‌ట‌. తీవ్ర‌మైన ద‌గ్గుతో తాను చాలా రోజులు బాధ‌ప‌డ్డాన‌ని అల్ల‌రి న‌రేష్ పేర్కొన్నారు. ఏదేమైనా ఆరోగ్యం పాడ‌వుతుంద‌ని తెలిసి కూడా అల్ల‌రి న‌రేష్ అలా చేశాడంటే.. వ‌ర్క్ పై ఆయ‌న‌కున్న డెడికేష‌న్ ను మెచ్చుకోవాల్సిందే.