దసరా సినిమాలో ఏకంగా 36 సెన్సార్ కట్స్… తొలగించే పదాలు, సీన్లు ఇవే..!

నేచరల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం దసరా సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగరేణి కార్మికుల జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఆసక్తికర మలుపులతో తెరకెక్కించారు. కాగా ఈ సినిమాలోని చాలా సీన్స్ అభ్యంతరంగా ఉన్నాయని, కొన్ని డైలాగ్స్‌లో అసభ్యకరమైన పదజాలన్ని ఉపయోగించారని సమాచారం.

అందుకే సెన్సార్ వారు సినిమాలో 36 కట్స్ చెప్పినట్లు తెలుస్తుంది. రెండు పార్ట్‌లుగా ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్‌లో మొదట భాగంలో ఇరవై, రెండో భాగంలో 16 మొత్తంగా 36 కట్స్ అని సమాచారం. అయితే ఆ సెన్సార్ చెప్పిన పదాలు, సీన్స్ ఏమిటి? అలాంటి వాటికి టీమ్ ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

మెయిన్ స్ట్రీమ్ హీరోకు సెన్సార్ వారు 16 కట్స్ చెప్పటం అంటే మాటలు కాదు. యూఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన సెన్సార్‌ బోర్డు సబ్‌టైటిల్స్‌ సహా అసభ్యకరమైన సంభాషణలకు ‘మ్యూట్‌’ పెట్టాలని, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే ఫాంట్‌ పెంచమని, వైలెన్స్‌ అధికంగా ఉన్న సన్నివేశాలను సీజీతో కవర్‌ చేయాలని చిత్ర టీమ్ కి సూచించింది. ఇంకా ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటలోని బూతు పదాలు ఉన్నాయని సెన్సార్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అలానే సినిమా లో ని కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చెయ్యడమే కాకుండా కొన్ని చోట్ల టైటిల్స్ ని తీసేయాలని చెప్పడం గమనార్హం. ఈ సినిమా డైలాగ్స్‌లో బెంచూత్ (బెం మ్యూట్), బద్దల్ బాసింగలైతయ్ (బద్దల్ మ్యూట్), బాడకవ్ (మ్యూట్) చేయమని సెన్సార్ వారు సూచించారు. ఈ పదాలతో పాటుగా వాడుక భాషలో సందర్భాన్ని బట్టి ఉపయోగించే పదాలను మ్యూట్ చెయ్యాలని సూచించారు. మరి దసరా మూవీ టీమ్ సెన్సార్ వారి సలహాను ఎంతవరకు పాటిస్తారో అనేది వేచి చూడాలి.

అయితే దసరా సినిమా పూర్తిగా గ్రామీణ ప్రాంత తెలంగాణ యాసతో తియ్యడం వల్ల కొన్ని పచ్చి బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే సెన్సార్ వారు ఈ కట్స్ పెట్టాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ దసరా మూవీ టీమ్ మాత్రం ఆ డైలాగులు ఆ ఎమోషన్ కు ఫరఫెక్ట్ అని భావిస్తున్నట్లు సమాచారం. ఇది సింగరేణి మైన్ ఫీల్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తెలంగాణ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.