తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ పై నారా రోహిత్ కామెంట్స్..!!

ఎన్నో సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని టిడిపి పగ్గాలు చేపట్టాలని అభిమానులు కొంతమంది కోరుకుంటున్నారు టిడిపిలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై చాలా సందిగ్ధత్తోనే ఉన్నారు. అలాగే టిడిపి సభలో సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో కూడా అక్కడక్కడ హోరెత్తిస్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ చంద్రబాబు గాని లోకేష్ గాని ఎన్టీఆర్ ఊసు మాత్రం ఎప్పుడూ ఎత్తడం లేదు.. అటు ఎన్టీఆర్ సైతం ఇప్పట్లో రాజకీయాలలో వచ్చే అవకాశాలు లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Nara Rohith: Nara Rohith's interesting comments on Jr. NTR's political entry
అయినప్పటికీ ఎన్టీఆర్ పై చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. ఇటీవల కూడా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన నారాలోకేష్ కు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా అనే ప్రశ్న ఎదురయింది దీనికి లోకేష్ తప్పకుండా ప్రజలకు మంచి చేసేవారు రాజకీయాల్లోకి రావాలని తెలియజేశారు. అయితే ఇప్పుడు నారా రోహిత్ తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ పై కామెంట్లు చేయడం జరిగింది.

చంద్రబాబు సోదరుడు కుమారుడు సినీ రంగంలో ఉన్న నారా రోహిత్ టిడిపికి మద్దతుగా ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు. తాజాగా నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆయన పాల్గొనడం జరిగింది. ఉమ్మడి అనంతపూర్ పుట్టపర్తిలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడికి వెళ్లిన నారా రోహిత్ కూడా ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి డిఫెన్స్ లో పడిందని అందుకే తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లుతోందని తెలియజేశారు.

యువ గళం పాదయాత్ర రాబోయే రోజుల్లో ప్రభంజనం రేపుతుందని యువత రాజకీయాల్లోకి రావాల్సిన ఆసన్నమైందని ఈ క్రమంలోని ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై నారా రోహిత్ వ్యాఖ్యలు చేశారు.. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని అందుకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఉంటుందని తెలియజేశారు.