మహేష్‌బాబుకు గతంలో ఆ చెత్త అలవాటు.. ఏంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో వివాద రహితుడుగా ఉన్నారు. ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా తయారవుతున్నారు. కుర్ర హీరోలు కూడా ఈ సీనియర్ హీరో ముందు తేలిపోతారు. తన హ్యాండ్సమ్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇక షూటింగ్‌లు అయిపోతే ఆ విరామాల్లో ఆయన ఫ్యామిలీతో సహా విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తుంటారు. తనకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో, వారికి ఎంత సమయం కేటాయిస్తున్నారో దీని ద్వారా అర్ధం అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్‌ అయిన మహేష్ పలు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. దాదాపు 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి, ఎందరో చిన్నారుల ప్రాణాలను నిలిపారు. అయితే ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న మహేష్‌కు గతంలో ఓ చెత్త అలవాటు ఉండేది. అదేంటో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో అందరికీ సిగరెట్, మందు తాగడం వంటి అలవాట్లు ఉంటున్నాయి. ముఖ్యంగా చాలా మంది తమ దైనందిక జీవితంలో సిగరెట్లు తాగుతుంటారు. మహేష్ బాబుకు కూడా గతంలో సిగరెట్ తాగే అలవాటు ఉండేదంట. రోజుకు కనీసం రెండు పెట్టెల సిగరెట్లు తాగే వాడంట. ఈ అలవాటును మానుకోవాలని చాలా సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలుస్తోంది. అయితే ఒక రోజు ఏదో పుస్తకాన్ని చదవడంతో సిగరెట్లపై విరక్తి వచ్చిందంట. దీంతో ఆ రోజు నుంచి సిగరెట్ ముట్టలేదని తెలుస్తోంది. మహేష్ బాబుకు ఉన్న ఆ దురలవాటు అలా మానిపోయింది.

ఈ విషయం తెలిసి సినీ జనాలు, ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. అది పూర్తైన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.