కోటలో పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..!

వైసీపీకి ఉన్న కంచుకోటల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి. ఈ కర్నూలు కోటలో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది..మరి ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అంటే అదే కొంచెం కష్టమనే పరిస్తితి. ఎందుకంటే ఈ సారి కర్నూలు కోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అసలు గత రెండు ఎన్నికలే ఏదో బోర్డర్ లో గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేసి సుమారు 3 వేల ఓట్ల తేడాతో గెలిచారు.

వైసీపీ నుంచి గెలిచి టి‌డి‌పి వైపుకు వచ్చారు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లారు..కానీ సీటు దక్కలేదు. దీంతో వైసీపీ నుంచి హఫీజ్ ఖాన్ పోటీ చేసి..టీడీపీపై దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే వైసీపీ వేవ్ లో ఇది చాలా తక్కువ మెజారిటీ. అంటే రెండు సార్లు బోర్డర్ లోనే గెలిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఎందుకంటే ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ మళ్ళీ పోటీ చేయాలని చూస్తుంటే..అటు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు.

అలా ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీని వల్ల వైసీపీకి నష్టం జరిగేలా ఉంది. మధ్యలో టి‌డి‌పి ఇంచార్జ్ టీజీ భరత్ బలం పెంచుకుంటూ వస్తున్నారు. ఇక వైసీపీలో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. దీంతో వైసీపీకి నష్టమే. పైగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ సారి కర్నూలు కోటలో టి‌డి‌పి హవా నడిచేలా ఉంది.