ఈవారం రిలీజైన 3 సినిమాలలో హిట్టైన సినిమా ఇదే… వెళ్లి చూసేయండి!

మన టాలీవుడ్ నుండి ప్రతి వారం చివరలో అనగా శుక్రవారం నాడు కనీసం రెండు మూడు సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఒకవేళ రిలీజైతే మాత్రం చిన్న సినిమాలు రిలీజు చేయాలంటే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే సంక్రాంతి ముగియడంతో పెద్ద సినిమాలు ఏవి ఇప్పట్లో రిలీజుకి నోచుకోవు. దాంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు వరుసపెట్టి రిలీజుకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ సినిమాలు తాజాగా రిలీజయ్యాయి.

వీటిలో మిగతా రెండు సినిమాలకంటే భారీ హైప్ మీద విడుదలైన సినిమా మాత్రం మైఖేల్. మైఖేల్ మూవీ ప్రోమోలునుండి, టీజర్, ట్రైలర్ ఒక రేంజులో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో పాన్ ఇండియా మూవీ అనడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగా నెలకొన్నాయి. ఇక సందీప్ కిషన్ తప్పకుండా హిట్టు కొడతాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. అయితే మైఖేల్ అనుకున్నంత రేంజ్ లో థియేటర్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే దీని తరువాత కొంతలో కొంత ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రానికి కూడా ప్రచారం దక్కింది.

ఇక బుట్టబొమ్మ మూవీ గురించి పెద్దగా జనాల్లో చర్చ నడవలేదు. ఓ మాదిరి ప్రమోషన్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ చేసింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ కి మైఖేల్ మూవీ రూపంలో మరో ప్లాప్ తోడయ్యింది. దర్శకుడు రంజిత్ జయకోడి మైఖేల్ సినిమాను అనుకున్నంతగా తీర్చిదిద్దలేదు. అలాగే దర్శకుడు చంద్రశేఖర్ టి రమేష్ తెరకెక్కించిన బుట్ట బొమ్మ పరిస్థితి కూడా అదేవిధంగా వుంది. మైఖేల్, బుట్ట బొమ్మ నిరాశపరచగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుహాస్ హీరోగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ వీకెంట్ మీరు రైటర్ పద్మభూషణ్ సినిమాకు ఇంటిల్లిపాది వెళ్లి చూడండి.