మామ అల్లుడు మరోమారు ఇరగదీయబోతున్నారు… కాబినేషన్ రిపీట్!

ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్లో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు రూపొందడం మనం గమనించవచ్చు. అందులోనూ ఎక్కువగా మామ అల్లుడు కాంబినేషన్లు ఎక్కువగా ఇపుడు తెరకెక్కడ విశేషం అని చెప్పుకోవాలి. ఇది యాదృశ్చికమో లేక మరొకటా అనే విషయం తెలియదు గాని వరుసగా ఓ నాలుగు ఐదు సినిమాలు ఒకేసారి రూపొందడం చిత్రమనే చెప్పుకోవాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే.

ఫిబ్రవరి 14వ తారీఖున ఆ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలు జరిపించుకోబోతున్నట్లుగా భోగట్టా. అలాగే వెంకటేష్ మరియు నాగచైతన్య గతంలో వెంకీ మామ అనే సినిమాలో మెరిసిన సంగతి మీకు తెలిసినదే. కాగా వీరు మరోమారు ఒక సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారంటూ టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అదే విధంగా నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్టు వినికిడి. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు మల్టీ స్టారర్ సినిమాలు వరుసగా రాబోతున్న తరుణంలో అనేకసార్లు పండగ వాతావరణం తెలుగు రాష్ట్రాలలో మొదలవ్వనుంది. అయితే ఈ సినిమాలన్నీ గతంలో వచ్చిన మాదిరిగానే ఎంటర్ టైన్మెంట్ ను అందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సురేష్ బాబు కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది. అయితే ఒక్క సినిమా మాత్రం కాస్త డిఫెరెంట్ గా రాబోతోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధర్మతేజ్ సినిమా. ఈ సినిమా మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనుంది.