జోరు మీద ఉన్న కళ్యాణ్ రామ్.. బింబిసారా 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్..!!

ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ అమీగోస్ కూడా ఒకటి. ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా ఈ నెల 10న‌ అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసారా తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Amigos Trailer: It's All About Kalyan Ram's Triple Dhamaka

అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బింబిసారా సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. కాగా ఆ సినిమాకు సీక్వల్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమాను ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా కళ్యాణ్ రామ్ ఐతే మాత్రం ఆ సీక్రెట్ ని రివిల్ చేశారు. అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బింబిసారా సినిమాను తాను అయితే వచ్చే ఏడాది చివరిలో మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

దీంతో ఆ సినిమాపై ప్రేక్షకుల్లో కావాల్సినంత ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మరోవైపు ‘బింబిసారా 2’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్ట్ 2 మరింత హైలెవల్లో ఉంటుందని మేకర్స్ కూడా చెబుతున్నారు. ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్ నటించారు. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించాడు. ఎం ఎం కీరవాణి సంగీతం సంగీతం అందించారు. క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యానికి చెందిన రాజు బింబిసారుడు చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం నాలుగు పార్టులుగా రానుందని తెలుస్తోంది.