మెగా అభిమానులకు బిగ్ అప్డేట్.. దళపతితో మెగా పవర్ స్టార్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ హిట్ కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు దగ్గరయ్యాడు. త్రిబుల్ ఆర్‌ అలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తన తర్వాత సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.

Ram Charan suffered 2nd degree ligament tear before RRR shoot

ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు సన్నా తో భారీ సినిమాకు కమిటీ అయ్యాడు. ఇక రాంచరణ్ తో వరుస సినిమాలు చేయడానికి పాన్ ఇండియా డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోని కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌ కూడా రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే లోకేష్ కనగ‌రాజ్‌ రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

విజయ్ లియోలో మిస్టర్ బాక్సాఫీస్.. క్రేజీ రూమర్ వైరల్ | Ram Charan To Be  Part Of Thalapathy Vijay\#39;s Leo , Thalapathy Vijay, Vijay\#39;s Leo, Leo,  Ram Charan - Telugu Ram Charan, Ramcharan, Vijays Leo

ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్గా మొదలైంది. ఈ సినిమాపై కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడు అంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ లో తెలంగాణకి చెందిన కారు విజువల్ కనిపించడం ఆసక్తిగా మారింది. దీనితో అది చరణ్ రోల్ కి ఏమన్నా లింక్ ఉందని రూమర్లు మొదలయ్యాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఉన్నాడో లేడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.