మహేష్ న్యూ లుక్ అదిరిపోయిందిగా ..క్లాస్ కటౌట్ తో మాస్ సినిమా వచ్చేస్తుంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ ఇద్దరి కలయికలు వస్తున్న మూడో సినిమా కూడా ఇదే. ఇప్పటికే ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ అండ్ టీం ఈ సినిమా కోసం కార్లుని సారథి స్టూడియో నుంచి మైత్రివనం వరకు కనిపించే రేంజ్ లో ఎగరేశారు.

Mahesh Babu & Trivikram Srinivas Team Up For The Second Time In An Untitled Action Drama Film

ఈ సినిమా షూటింగ్ కు దగ్గర్లో ఉన్నవారు త్రివిక్రమ్ ఎలాంటి మాస్ సినిమా చేస్తున్నాడు రా బాబు కార్లు ఈ విధంగా గాల్లోకి లేస్తున్నాయి అని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ లోనే మహేష్ బాబు హెడ్ స్కార్ఫ్ కట్టిన ఫోటో అండ్ వీడియో కూడా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీంతో మహేష్ అభిమానులు పోకిరి, శ్రీమంతుడు, లాంటి హిట్ లోడింగ్ అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక దీంతో ప్రస్తుతం జరిగే షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో మహేష్ విదేశాలకు చెక్కేశాడు.

నమ్రత, మహేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చారు. అక్కడ మహేష్ స్టైలిష్ గా ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో బ్లూక్యాప్ పెట్టుకొని మహేష్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఆ ఫోటోలు చూసిన వాళ్ళు స్టైలిష్ హీరోతో త్రివిక్రమ్ మాస్ సినిమా చేస్తున్నాడు అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే అందరికంటే భిన్నంగా ఓ అభిమాని మాత్రం ‘మీరు ఎయిర్పోర్ట్ పక్కనే ఇళ్లు కట్టుకుంటే బాగుంటుంది సర్. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తున్నారు’ అంటూ కామెంట్ చేశారు. విదేశాల నుంచి మహేష్ తిరిగి రాగానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మళ్ళీ ప్రారంభం కానుంది.