సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పృథ్వీరాజ్ శృంగార వీడియో… వాడేసుకుంటున్న నెటిజన్లు!

టాలీవుడ్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. పృథ్వీరాజ్ అనగానే ప్రేక్షకులకు ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఆ డైలాగ్ అంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం అతనే. ఇకపోతే పృథ్వీరాజ్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు కావస్తున్న సంగతి విదితమే. పృథ్వీరాజ్ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ వచ్చాడు. ఇదే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఓ పార్టీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ ద్వారా కీలక పదవిని అందుకున్నాడు కూడా.

అయితే ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సడెన్ గా సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన ఆడియో లీకై, ఆ పదవిని కాస్త కోల్పోయేట్టు చేసింది. అప్పటివరకు పృథ్వీరాజ్ అంటే సాఫ్ట్ కార్నర్ వున్న జనానికి నెగటివ్ అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆ సరసాలు ఆడియోలో “వెనకల నుండి గట్టిగా వాటేసుకోవడం” అంటూ హద్దులు మీరి మాట్లాడడంతో లేడీస్ ఆయనపై అప్పట్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి విదితమే. కాగా తర్వాత మళ్లీ మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్న పాత్రల్లో కనిపిస్తున్న పృథ్వీరాజ్.. రీసెంట్ గా జబర్దస్త్ తన్మయితో కలిసి ఇన్ స్టా రీల్ చేసి మరలా విమర్శలకు లోనయ్యాడు.

అవును… “మాస్టారు మాస్టారు అంటూ నా మనసును గెలిచారు” అనే సాంగ్ కి వీరు రొమాంటిక్ స్టెప్పులు వేయగా సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కూడా పృథ్వీరాజ్ ఆమెని వెనక నుండి వాటేసుకోవడం చూడవచ్చు. దీంతో నెటిజన్లు పృథ్వీరాజ్ ని ఓ రేంజులో యేసుకుంటున్నారు. “నీకు వెనక నుండి వాటేసుకోవడం అనే బుద్ధి పోలేదా? ఏం మనిషివా రా బాబు!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే ఏకంగా “వెనుక నుండి పట్టుకుంటేనే నీకు ఆ ఫీలింగ్ వస్తుందా?” అంటూ అతని మీద కామెంట్స్ చేస్తున్నారు.