నటసింహం నందమూరి బాలకృష్ణ కు మాస్ ప్రేక్షకులలో ఆయనకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎవరికి ఉండదు. నాలుగు దశాబ్దాలకు పైగా నటరత్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని తన ఒంటి చేతుపై లాక్కొస్తున్నాడు. తన తండ్రి తర్వాత జనరేషన్ లో జానపద. పౌరాణిక పాత్రలు చేయాలంటే అది ఒక బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనేల తన కెరియర్ లో ఎన్నోఅద్భుతమైన రికార్డులను సృష్టించాడు. వాటిని తిరగరాసి మళ్లీ చరిత్ర తిరగరాయాలన్న అది తనకే వీలవుతుందని ఎన్నో సందర్భాల్లో ఆయన రుజువు చేశారు.
ఆరుపదుల వయసు దాటుతున్న కూడా ఇప్పటికీ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరస సినిమాలను లైన్ లో పెడుతూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా మరో అరుదైన ఘనతను బాలకృష్ణ సాధించాడు. ఇక బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి గా ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయనందుకున్నాడు. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. తండ్రి కొడుకులుగా బాలయ్య ద్విపాత్ర అభినయం ఫ్యాన్స్ కి సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది.
వీర సింహారెడ్డి సినిమాలో తన నట విశ్వరూపం చూపించి ఎప్పట్లాగే తన పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లో మోత మోగించేశాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆయన అభిమానుల మనసులో ఓ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నార్మల్ డేస్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టుతుంది. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ సంధ్య 35mm లో ఈ సినిమా ఫిబ్రవరి 8 నాటికి 28 రోజుల్లోనే అక్షరాల కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఈ సినిమాకు ముందు ఇదే థియేటర్లో నరసింహనాయుడు(2001), అఖండ(2021) కోటి రూపాయల కలెక్షనులు రాబట్టాయి. ఇక ఇప్పుడు దీంతో బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. అది కూడా కేవలం 18 నెలల గ్యాప్ లో రెండు సినిమాల్లోనూ డ్యూయల్ రోల్ కావడం విశేషం. ఇక మన టాలీవుడ్ లో ఈ రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది కూడా బాలయ్య మాత్రమే అంటూ నటసింహం అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇది ఆల్ టైమ్ అన్‌బీటబుల్ రికార్డ్ అని కూడా చెప్తున్నారు. ‘అఖండ’ 53వ రోజు మ్యాట్నీకి రూ. కోటి మార్క్ టచ్ చేయగా.. ‘వీర సింహా రెడ్డి’ కేవలం 28వ రోజు ఫస్ట్ షోకే ఆ ఘనత సాధించింది. మొత్తంగా రూ. కోటి, 18 వేల 555 (1,00,18,555) గ్రాస్ వసూలు చేసింది. వరుసగా రెండు కోటి రూపాయల గ్రాస్, ఇప్పటి వరకు మూడు సినిమాలు కలిగిన ఏకైక హీరో మా బాలయ్య మాత్రమేనంటూ సామాజిక మాధ్యమాలలో హంగామా చేస్తున్నారు నందమూరి అభిమానులు..