ఏంటి..ఈ హీరోకి ఆ మాత్రం తెలియదా..? ఫస్ట్ టైం ట్రోల్ అవుతున్న మహేశ్ బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం ..చాలా కామన్ గా అయిపోయింది . మరి ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా ..?వాటిని పట్టుకుని ట్రోల్ చేద్దామా ..? అంటూ కాచుకుని కూర్చుంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే అలాంటి ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయిపోయాడు మహేష్ బాబు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .

ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సినిమాని కూడా లైన్లో పెట్టాడు. ఇలాంటి క్రమంలోనే వరుసగా తన పనులను చకచకా ఫినిష్ చేస్తున్న మహేష్ బాబు.. రీసెంట్ గా హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో అభిమానులకు దర్శనమిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ఎప్పుడు సెక్యూరిటీతో వచ్చే మహేష్ బాబు ఈసారి సెక్యూరిటీ లేకుండా చాలా సాదాసీదాగా నార్మల్గా ఎంట్రీ ఇచ్చాడు .ఇంతకీ మహేష్ బాబు ఎందుకు హైటెక్ సిటీకి వచ్చాడు అన్నదేగా మీ డౌటు..తన ఆధార్ కార్డు వెరిఫికేషన్ సంబంధించిన పనుల కోసం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నార్మల్ సిటిజెన్ గా హైటెక్ సిటీ లోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ సెంటర్ కి వెళ్లారు.

హైటెక్ సిటీలో మహేశ్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో.. ఏం పనిమీద వచ్చారంటే?

స్టార్ హీరో మహేష్ బాబు.. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా..? టపి టపి మని ఫోటోలు తీసేయ్యరు. అలా ఫోటోలు వీడియోలు తీసేసి విచ్చలవిడిగా తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసేసారు జనాలు . ఈ క్రమంలోనే మహేష్ బాబు వీడియో, పిక్స్ వైరల్ గా మారాయి . అయితే కొందరు పనిలేని ఆకుతాయిలు మహేష్ బాబును కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. నీతి న్యాయం పద్ధతి అంటూ చెప్పే మహేష్ బాబుకి జనాల్లోకి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవాలని తెలియదా ..ఆఫ్ కోర్స్ కరోనా ఫ్రీ కంట్రీ అంటూ చెప్పినా ఇప్పతికి పలు గవర్నమెంట్ ఆఫీసుల్లో మాస్క్ లేనిదే లోపలికి ప్రవేశం లేదు అంటూ బోర్డులు పెట్టి ఉంటారు .

హైటెక్ సిటీలో సందడి చేసిన మహేష్ బాబు.... షూటింగ్ కోసం కాదు...ఎందుకో తెలుసా  | mahesh babu made noise in hi tech city not for shooting do you know why, Mahesh  Babu, hi-tech city, not for

అలాంటి మహేష్ బాబు మాస్కు ధరించుకోకపోవడం ఏంటి అంటూ జనాలు కావాలని టార్గెట్ చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళకి మహేశ్ ఫాన్స్ కూడా ఇచ్చి పడేస్తున్నారు . పని పాట లేని వాళ్ళు ఇలా చిన్న విషయానికి మహేష్ బాబును ట్రోల్ చేసి ఆపేయడం మంచిది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో మహేష్ బాబు పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!