లోకేష్ కీలక హామీ..పక్కా సక్సెస్ అవుతుందా!

పాదయాత్రతో సైలెంట్‌గా అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకునేలా నారా లోకేష్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పాదయాత్రకు మీడియాలో పెద్ద హైప్ రాలేదు గాని..స్థానికంగా లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ ప్రజలని ఆకట్టుకునేలా మాత్రం లోకేష్ ముందుకెళుతున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని ప్రశ్నిస్తూనే..స్థానిక సమస్యలని పరిష్కరించడానికి హామీలు ఇస్తున్నారు. అలాగే వర్గాల వారీగా ప్రజలతో సమావేశమవుతూ..వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు.

ఇదే క్రమంలో తాజాగా లోకేష్..అతి కీలక హామీ ఇచ్చారు. అది ఏంటంటే..అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని చెప్పారు. నిజానికి ఈ హామీ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌లపై దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పన్నులు విధించింది. కానీ అది కనబడకుండా…పెట్రోల్, డీజిల్ లపై పర్సంటేజ్ రూపంలో ట్యాక్స్ విధించింది. అలాగే రోడ్డు ట్యాక్స్ అంటూ రూపాయి విధిచింది. అయితే  పర్సంటేజ్ రూపంలో విధించిన ట్యాక్స్ మాత్రం పైకి కనిపించదు.

అయితే ఆ మధ్య అన్నీ రాష్ట్రాలు ఎంతో కొంత ట్యాక్స్ తగ్గించాయి. కానీ ఏపీ ప్రభుత్వం తగ్గించలేదు. దీంతో ప్రజలపై పెనుభారం పడుతుంది. ఇక ఏపీతో పోలిస్తే పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువ. తాజాగా లోకేష్ కర్ణాటక బోర్డర్ లో పాదయాత్ర చేస్తూ..అక్కడ ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లని చూపించారు.

అయితే ఈ ట్యాక్స్ వల్ల ప్రజలు భారం ఎక్కువ పడుతుంది. పైగా రవాణా వల్ల ప్రతి నిత్యావసర ధర పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌లపై పన్ను తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఈ హామీ వర్కౌట్ అవుతుందనే చెప్పాలి.