న‌య‌న్‌ను `లేడీ సూప‌ర్‌స్టార్` అన‌క్క‌ర్లేదు.. ఘోరంగా అవ‌మానించిన యంగ్ హీరోయిన్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ అంటే న‌య‌న‌తార‌. అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా న‌య‌న‌తారను లేడీ సూప‌ర్ స్టార్ అనే పిలుస్తుంటారు. అంద‌రూ ఆమెకు క‌ట్ట‌బెట్టిన బిరుదు అది. కానీ, న‌య‌న్‌ను లేడీ సూప‌ర్ స్టార్ అన‌క్క‌ర్లేదు అంటూ యంగ్ హీరోయిన్ మాళ‌విక మోహ‌న‌న్ ఘోరంగా అవ‌మానించింది. గ‌త కొద్ది రోజుల నుంచి న‌య‌న‌తార‌, మాళ‌విక మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

అస‌లేం జ‌రిగిందంటే.. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో `లేడీ సూపర్ స్టార్‌గా ఉన్న ఓ హీరోయిన్ ఆసుపత్రిలో చనిపోయే సీన్ కోసం పూర్తిగా మేకప్ వేసుకుంది. ఎవరైనా చనిపోయే సీన్ కోసం అలా అందంగా రెడీ అవుతారా?` న‌య‌న్ పేరు చెప్ప‌కుండా వెటకారంగా మాట్లాడింది. కొద్ది రోజుల త‌ర్వాత నయనతార కూడా మాళవిక పేరుని ప్రస్తావించకుండా ఆమెకు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది.

`ఆసుపత్రి సీన్ అయినంత మాత్రాన చింపిరి జుట్టుతో కనిపించలేము కదా? అయినా కమర్షియల్ సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్లు క‌నిపించాలి` అంటూ న‌య‌న్ ఇచ్చిప‌డేసింది. దీంతో వీరిద్దరి మధ్య చెలరేగిన గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు మళ్లీ రాజుకుంది. తాజాగా మాళ‌విక మ‌రోసారి న‌య‌న్‌పై ప‌రోక్షంగా నోరు జారింది. ఓ అభిమాని `లేడీ సూపర్‌స్టార్‌’పై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా.. `లేడీ సూప‌ర్ స్టార్ అని అన‌క్క‌ర్లేదు. అలా పిల‌వ‌డం నాకు న‌చ్చ‌దు. మహిళలు కూడా సూపర్‌స్టార్‌ అని పిలవొచ్చు. దీపికా పదుకొనె, అలియా భట్‌, కత్రినా కైఫ్‌ వంటి వారు సూపర్‌స్టార్లు. అలాగే అందర్నీ పిలిస్తే స‌రిపోతుంది` అంటూ మాట్లాడింది. దీంతో మరోసారి మాళ‌విక కామెంట్స్ వైర‌ల్ గా మారింది. మ‌రి ఈ కామెంట్స్‌పై న‌య‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

https://twitter.com/chettyrajubhai/status/1624303987767001088?s=20&t=CevqERhje8w109lPxbkvUA